POLITICS

వైసీపీ సర్కార్ ను ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు

వైసీపీ సర్కార్ ను ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వికేంద్రీకరణకు మద్దతు పేరుతో ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంపై పవన్ ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లపై ఏపీ మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. మంత్రి గుడివాడ అమరనాథ్ పవన్ కు త్రీ క్యాపిటల్స్ ఉన్నాయంటూ విమర్శించారు. దత్త తండ్రి చంద్రబాబు తరపున…దత్తపుత్రుడు పవన్ మియావ్ వియావ్…మియావ్..మియావ్ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్

త్రీ క్యాపిటల్స్ 1 అంతర్జాతీయ రాజధాని మాస్కో…2 జాతీయ రాజధాని ముంబై 3 పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంటూ గుడివాడ్ అమరనాథ్ ట్వీట్స్ చేశారు. అంబటి రాంబాబు కూడా పవన్ పై మండిపడ్డారు. ప్యాకేజీ కోసం మొరిగే వాళ్లకు గర్జన అర్థం కాదంటూ సెటైర్ వేశారు.