SPORTS

పాత, కొత్త కలయిక.. ఆసియా కప్ కోసం టీమిండియా ఇదే.. ఆ ఇద్దరి ఎంపిక షాకింగ్

ఈసారి బీసీసీఐ జాగ్రత్త పడింది. పాకిస్తాన్ తో ఫైట్ కోసం పటిష్టమైన జట్టునే తీసుకుంది. కొద్దికాలంగా 4వ స్థానంలో ఫినిషర్ లేకపోవడంతో అన్ని వైపులా విమర్శలు చుట్టుముట్టాయి.

అందుకే ఆ స్థానంలో ఇటీవల విండీస్ టూర్ లో రాణించిన తిలక్ వర్మను తీసుకుంది. అయితే కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఫాంను బట్టి తిలక్ కు అవకాశం దక్కనుంది.

ఈనెల 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే భారత జట్టును ప్రకటించింది. ఆగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పాత, కొత్త కలయికతో జట్టును తీర్చిదిద్దింది. గాయాలతో సంవత్సర కాలంగా ఆడకుండా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లను టీంలోకి తీసుకోవడమే పెద్ద సంచలనంగా మారింది. వీరు ఫిట్ నెస్ సాధించారా? మునుపటిలా పరుగులు చేస్తారా? అన్నది వేచిచూడాలి. ఫాంలో ఉన్న వారిని కాదని.. వీరిని తీసుకోవడమే పెద్ద షాకింగ్ గా చెప్పొచ్చు.

రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా హార్ధిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ గానే ఉంచింది. గిల్ ను ఓపెనర్ గా కొనసాగించింది. వన్ డౌన్ లో విరాట్ , తర్వాత వరుసగా కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యార్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, జడేజాలతో బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది.

ఇక బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శార్ధుల్, ప్రసిద్ధ్ కృష్ణలతో జట్టును ఎంపిక చేసింది. అందరూ సంజూశాంసన్ రావాలంటూ ఈ మధ్యన నెటిజన్లు ఉద్యమం లేవనెత్తడంతో అతడిని ‘బ్యాకప్ ప్లేయర్’గా ఎంపిక చేయడం విశేషం.

టీమిండియా ఇదే..