ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ అంటే తెలియని వారు అసలు ఎవరూ ఉండరు. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వాట్సప్ ఉపయోగిస్తూ ఉంటారు. వాట్సప్ లో ఎక్కువ సమయం గడిపేవారు చాలామందే ఉంటారు. పొద్దున్నే లేవగానే వాట్సప్, రాత్రి నిద్రపోయే ముందు వాట్సప్ లో మెస్సేజ్ లు చెక్ చేసుకునేవాళ్లు ఎందరో. ఫ్రెండ్స్ తో ఛాటింగ్, స్టేటస్ లు, డాక్యుమెంట్స్ కు వాట్సప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైనా డ్యాకుమెంట్ పంపించుకోవాలన్నా, ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేయాలన్నా వాట్సప్ లో చాలా సులువు అవుతుంది.
అయితే వాట్సప్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వాట్సప్ ప్రవేశపెడుతుంది. యూజర్లను ఆకట్టుకోవడానికి ఫీచర్లను అప్డేట్ చేయడంతో పాటు కొత్త ఫీచర్లను కూడా తీసుకొస్తుంది. అయితే తాజాగా మరో ఫీచర్ ను వాట్సప్ తీసుకురానుంది. త్వరలో మరో కొత్త ఫీచర్ వాట్సప్ లో రానుంది. అదేంటంటే.. ఇక నుంచి ఒకసారి మాత్రమే మెస్సేజ్ చూడటానికి వీలు కల్పించేలా కొత్త ఫీచర్ ను తీసుకొస్తుంది. త్వరలో వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్ ను వాట్సప్ తీసుకొస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా పంపించిన మెస్సేజ్ ను ఒకసారి మాత్రమే చూసేలా సెట్టింగ్స్ లో మార్చుకోవచ్చు.
ఒకసారి మెస్సేజ్ చూశాక అది ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా పంపించిన మెస్సేజ్ ను ఒకసారి మాత్రమే చూడగలం. ఇప్పటికే ఫొటోలు, వీడియోలకు సంబంధించి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇతరుల నుంచి వచ్చిన ఫొటోలు, వీడియోలు ఒకసారి చూసిన తర్వాత.. మరోసారి వాటిని చూడటానికి వీలు అవ్వదు. అలాగే వాటిని స్క్రీన్‌షాట్ తీసుకోవడం కూడా కుదరదు. ఇప్పుడు సేమ్ అలాంటి ఫీచర్ ను మెస్సేజ్ లకు కూడా వాట్సప్ తీసుకురానుంది. ఈ ఫీచర్ వల్ల ఒకసారి చూసిన మెస్సేజ్ తర్వాత చూడటానికి వీలు ఉండదు. ఒకసారి చూసిన తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. ఇప్పటికే కొంతమంది యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా.. త్వరలో యూజర్లందరికీ రానుంది.