TRENDING

రోడ్డుపై క్యాట్‌ఫిష్‌ల క్యాట్‌వాక్‌

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో లారీ బోల్తాపడి చేపలన్ని రోడ్లపై పడిపోయాయి. భద్రాచలం రాజమండ్రికి వెళ్లే మార్గంలో చింతూరు మారేడుమిల్లి మధ్య ఉన్న రోడ్డుపై లారీ బోల్తా కొట్టింది. కొండపై ఇరుకుగా ఉండే రహదారి వల్లే వేరే వాహనాన్ని తప్పించబోయి చేపల లారీ బోల్తా పడింది. ఆ ఘటనలో లారీలోని క్యాట్‌ఫిష్‌ చేపలన్ని రోడ్డుపై పడిపోయాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు వాహనాలను ఆపి ఎవరికి దొరికినన్ని చేపలను వారు పట్టుకెళ్తున్నారు.