4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట్ గ్రామంలో సెంట్రల్ టస్సర్ రీసెర్చ్ మరియు,ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ( పట్టు పరిశ్రమపై అవగాహన సదస్సు) ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ భారతి హొలీ కెరీ, ఐటిడిఎ పిఓ హాజరయ్యారు..ఈ ప్రాంత రైతులు వ్యవసాయం పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయంగా దసలి పట్టు పెంపకంపై మొగ్గు చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు..ఈ ప్రాంతంలో దట్టమైన అడవిలో లభించే మొక్కల ద్వారా పట్టును ఉత్పత్తి చేసి రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చునని ఆమె తెలిపారు… ఈ వర్క్ షాప్ ద్వారా రైతులు సలహాలు,సూచనలు తీసుకొని వారి వద్ద నుండి అమూల్యమైన సమాచారాన్ని సేకరించి మంచి లాభాలు గడించ వచ్చునని,ఈ వర్క్ షాప్ రైతులకు దోహదపడుతుందని ఆమె అన్నారు..ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు,రైతులు పాల్గొన్నారు…..