NationalTELANGANA

బీబీసీ డాక్యుమెంటరీపై రాహుల్ గాంధీ కామెంట్స్

2002 నాటి గుజరాత్ అల్లర్లపై (Gujarat 2002 riots) బీబీసీ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీని షేర్ చేయకూడదని కేంద్రం ట్విటర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా జమ్మూలో ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi).. అక్కడ ప్రెస్ మీట్ లో బీబీసీ డాక్యుమెంటరీ (BBC documentary) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజాన్ని దాచి పెట్టలేరని, ఏదో ఒక విధంగా వాస్తవం వెలుగులోకి వస్తుందని Rahul Gandhi నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ”మన పురాణాలు, ఉపనిషద్ లు, భగవద్గీత చదివితే ఒక విషయం అర్థం అవుతుంది. అదేంటంటే.. నిజం ఎన్నటికైనా బయటకు వస్తుంది. నిషేధించినా, అణచివేయాలని చూసినా, సీబీఐ, ఈడీలను ఉపయోగించినా, వ్యవస్థలను నియంత్రించాలని చూసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా.. (Gujarat 2002 riots) నిజాన్ని దాయలేరు. వాస్తవం బయటకు వచ్చి తీరుతుంది” అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు.

నిజం అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. జనాలకు వెల్లడి అయ్యే ఒక అలవాటు నిజం అనే దానికి ఉంటుంది. అది చీకట్లో ఉండలేదు. వెలుగులోకి వస్తుంది. అది ప్రకాశవంతంగా వెలుగుతుంటుంది. నిషేధాలు, అణచివేతలు, బెదిరింపులు దానిపై పనిచేయవు’ అని రాహుల్ గాంధీ (Gujarat 2002 riots) బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా వ్యంగ్య విమర్శలు చేశారు. గుజరాత్ అల్లర్లకు (Gujarat 2002 riots) సంబంధించి “India: The Modi Question” అనే పేరుతో బీబీసీ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) రెండో భాగం మంగళవారం రాత్రి విడుదల కానుంది. లండన్ లో, భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ డాక్యుమెంటరీ రెండో భాగాన్ని బీబీసీ (BBC) విడుదల చేయనుంది. కాగా, ఈ డాక్యుమెంటరీ (BBC documentary)పై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇదొక ప్రచార చిత్రమని, భారత ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అని విమర్శించింది. బ్రిటన్ ప్రధాని రుషి సునక్ (UK PM Rishi Sunak) కూడా ఆ బీబీసీ డాక్యుమెంటరీ (BBC documentary) ని తప్పుబట్టారు. భారత ప్రధాని మోదీ (PM Modi) ని ఆ డాక్యుమెంటరీలో తప్పుగా చిత్రించారని, అది తనకు ఆమోదనీయం కాదని ఆయన వ్యాఖ్యానించారు.