TELANGANA

ప్రభుత్వ నిధుల మళ్లింపు.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీ కాంగ్రెస్ నేతలు. !

ఎన్నికల అధికారులను తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు కలవనున్నారు. ప్రభుత్వ నిధుల మళ్లింపుపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డ తర్వాత బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయాలపై అనుమానాలున్నాయని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక సందేహాలను లేవనెత్తారు.

 

కమీషన్‌ల కోసం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని.. కేసీఆర్ ఓటమి భయంతో నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను.. ఇతరుల పేర్ల మీదకు మార్చి.. రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ ట్రాన్సాక్షన్స్‌పై విజిలెన్స్ నిఘా పెట్టాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని రేవంత్‌ రెడ్డి అన్నారు.