APTELANGANA

హైదరాబాద్‌ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. బాగ్‌లింగపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్‌ సామాగ్రి ఉండటంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

నాలుగు ఫైర్‌ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాము పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో స్థానికులు పరుగులు తీస్తున్నారు.