TELANGANA

పోతురాజు గుడి దగ్గర వైభవంగా మహాశివరాత్రి వేడుకలు…

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం తిరుమలకుంట కాలనీ పోతురాజు గుడి దెగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.శనివారం వేకువజాము నుంచే భక్తులు చేరుకుని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ సున్నం సరస్వతి దంపతులు,ఎంపీటీసీ నారం నాగలక్ష్మి దంపతులు, మండల కార్యదర్శి జుజ్జురి వెంకన్నబాబు దంపతులు, వుజ్జిని సాయిబాబు దంపతులు, పల్లెల రామలక్ష్మయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు చూడటానికి గుడి ప్రాంగణంలో కోలాటం ఏర్పాటు చేశారు.అనంతరం దాహార్తిని తీర్చేందుకు నీటి కుళాయిలతో పాటు దాతల సహాయంతో అన్నసంతర్పణ సిద్ధం చేశారు.ఈ కార్యక్రమాలకు ప్రజానాయకులు, ప్రభుత్వ పాలకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.