అల్లూరిసీతారామరాజు జిల్లా,
దేవీపట్నం.
దేవీపట్నం మండలం ముసళ్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది తో సమావేశం నిర్వహించిన ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి.
ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులు మరణించడం చాలా బాధాకరం అని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్ నీ విధులు నుంచి తొలగించడం జరిగింది అని హెచ్.ఎం ని వేరే పాఠశాలకు బదిలీ చేయటం జరిగింది అని అన్నారు.
ముసళ్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల నూతన హెచ్. ఎం గా క్షేమభాయ్ వార్డెన్ కృష్ణకుమారిని నియమించడం జరిగింది.
విద్యార్థునిల తల్లితండ్రులు అధైర్య పడొద్దు అని మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది అని వచ్చే నెలలో పరీక్షలు రానున్నాయి కాబ్బటి పరీక్షలకు సిద్దపడాలి గనుక మీ పిల్లలను పాఠశాలకు పంపించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమం లో హెచ్.ఎం క్షేమబాయ్, వార్డెన్ కృష్ణకుమారి, పాఠశాల సిబ్బంది, విద్యార్థుని ల తల్లితండ్రులు పాల్గొన్నారు.