TELANGANA

మంచిర్యాల జిల్లా.చెన్నూర్ మండలం లోCPI పార్టీ ఆధ్వర్యంలో గూడ అంజన్న యాదిలో మహా సభ పోస్టర్లు ఆవిష్కరణ*

 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రెండవ గ్రౌండ్ లో మార్చ్ 5 వ తేదీన కవి, రచయిత కామ్రేడ్ గూడ అంజన్న యాదిలో సీపీఐ ప్రజా సంఘం తెలంగాణ ప్రజానాట్యమండలి మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌలు భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన గూడ అంజయ్య యాది జరుగు పోరు బాట పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం పాల్గొని మాట్లాడుతూ గూడ అంజన్న యాదిలో మార్చి 5న ఊరు మనదిరా… వాడ మనది రా అనే పోరుబాట నీరాజనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. బెల్లంపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న బారీ బహిరంగ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ k.నారాయణ, యుద్ద నౌక గద్దర్, కళాకారులు మిట్టపల్లి సురేందర్, వందేమాతరం శ్రీనివాస్, విప్లవా చిత్రాల హీరో ఆర్ నారాయణమూర్తి ,రాంబాబు, తెలు విజయ, జయరాజ్, కోదండ రామ్, మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారు అని తెలిపారు. పాట ప్రజల్లో బ్రతికే వుంది అని, పాటలతో నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి తెలంగాణా సాధించడం జరిగిందని, అలాంటి కళాకారుడు గూడ అంజన్న మరణం తీరని లోటని, కళాకారుడు అంజన్న యాదిలో జరిగే బహిరంగ సభలో ప్రముఖులు తెలంగాణలో జరుగుతున్న వివక్ష, అణిచివేత పై వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ .సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌలు సిపిఐ మండల కార్యదర్శి నేన్నేల సమ్మయ్య సిపిఐ జిల్లా సమితి సభ్యులు కాదండి సాంబయ్య సిపిఐ నాయకులు సుంకరి చందు దుర్గం దేవాదాసు అన్నం రాజయ్య దుర్గం శంకర్ సారయ్య తదితరులు పాల్గొన్నారు…..