TELANGANA

తెలంగాణలో ముందస్తు ఎన్నికల పై సీఎం కేసిఆర్ క్లారిటీ…

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని గత కొన్ని రోజులుగా వార్తుల వస్తున్న విషయం తెలిసిందే. నిర్దేశిత సమయం కంటే ముందుగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారంటూ వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ముఖ్యమంత్రి తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. శుక్రవారం జరిగిన బీఆర్‌ఎస్‌ సమావేశంలో ఈ విషయంపై సీఎం స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సీఎం తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని, ప్రజల్లోనే ఉండాలని పార్టీ నాయకులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

 

తెలంగాణ భవన్‌లో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ పలు కీలక విషయాలను పంచుకున్నారు. నాయకులు పాద యాత్రలు చేసుకోవాలని నాయకులకు సీఎం సూచించారు. ఏప్రిల్‌ 27వ తేదీన నిర్వహించే ప్లీనరీ ఈసారి లేదని, బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని సీఎం తెలిపారు. వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.

 

మంత్రులు నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సీఎం తెలిపారు. కవిత ఈడీ నోటీసులపై కూడా కేసీఆర్‌ స్పందించినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇలాంటి ఇంకా చాలా చూస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు సమాచారం. ఇలాంటి వాటికి భయపడొద్దని, ప్రెస్‌మీట్‌లు పెట్టి కేంద్రపై రివర్స్‌ అటాక్‌ చేయాలని కేసీఆర్‌ పార్టీ నాయకులకు సూచించారు.