APTELANGANA

దొరపల్లె గ్రామ బిజెపి నాయకులను అభినందించిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి

 

నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లె గ్రామంలో శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని జిల్లా బిజెపి మహిళా అధ్యక్షురాలు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక సహాయం అందించగా దొరపల్లె గ్రామ బిజెపి నాయకులు డోన్ మండల బిజెపి అధ్యక్షుడు శివ శంకర్, ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేంద్రుడు అట్టహాసంగా నిర్వహించిన జిల్లా స్థాయి ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విన్నర్,రన్నర్ విజేతలకు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక సహాయంతో 10.000, 5.000 రూపాయల చెక్కులను అందజేసిన నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి,జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామయ్య సహాయ సహకారాలతో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక,మానసిక ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా,మనిషి జీవన వికాసంలో ప్రధాన భూమిక పోషిస్తాయనే సదుద్దేశంతో డోన్ మండలం దొరపల్లె గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినంద నీయమని, అలాగే కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో ప్రజా ఉపయోగ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు,ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి కొత్త జిల్లాగా నంద్యాల ఏర్పడిన తర్వాత మొదటి సారి జిల్లా స్థాయిలో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి జిల్లాలో దొరపల్లెకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారని, నంద్యాల జిల్లాగా ఏర్పడిన తొలి రోజుల్లోని బిజెపి జెండా ఆవిష్కరించిన తొలి గ్రామంగా దొరపల్లె ప్రత్యేక గుర్తింపు పొందడంలో ఎంతో కృషి చేసిన దొరపల్లె గ్రామ బిజెపి నాయకులు డోన్ మండల బిజెపి అధ్యక్షుడు శివ శంకర్, ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేంద్రుడు లకు అభినందనలు తెలియజేస్తూ,వారికి పూర్తి సహకారం అందిస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామయ్య ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇదే స్పూర్తిని రాబోయే ఎన్నికలలో కొనసాగించి జిల్లాలో తొలిసారి డోన్ నియోజకవర్గంలో డోన్ కొండపై తొలిసారి బిజెపి ఎమ్మెల్యే జెండా ఎగురవేయాలని కోరుకుంటు న్నానని అందుకు ప్రజలు బిజెపిని అర్థం చేసుకుని ఆదరించాలన్నారు, అంగరంగ వైభవంగా జరిగిన ఈ ప్రధాని నరేంద్ర మోడీ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో బుడ్డా శ్రీకాంత్ రెడ్డి,ఆర్మీ రామయ్య,శివ శంకర్, దేవేంద్రుడు,గంగాధర్, డాక్టర్ పోలా వెంకటేశ్వర్లు,మల్లి కార్జున,వడ్డే మహారాజ్,డోన్ నియోజకవర్గ దొరపల్లె గ్రామ బిజెపి కార్యకర్తలు,స్థానిక ప్రజలు.