APTELANGANA

ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు

ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు

రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవీపట్నం మండలం ఎంపీపీ కుంజం మురళి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమం ప్రారంభించడం జరిగింది
ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థుల విన్యాసాలు ఆటపాటలు డాన్స్ పోటీలు క్విజ్ పోటీలు అనేక రకములైన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు తల్లిదండ్రులని ఎంతో ఆకట్టుకున్నాయి వీరి కార్యక్రమంలో చూసినవారు మంత్రముగ్ధులైనారు అనంతరం కార్యక్రమంలో డాన్స్ పోటీలలో సాంస్కృతిక రంగంలో ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థికి ఎంపీపీ కుంజం మురళి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగినది అనంతరం ఎంపీపీ కొంచెం మురళి మాట్లాడుతూ ఇందుకూరు గ్రామం లో ఏజెన్సీ గ్రామం లో ఒక ప్రైవేట్ స్కూల్ రన్నింగ్ చేయడం చాలా కష్టం తో కూడుకున్నది అని అయినా సరే ఎన్నో శ్రమలు కూర్చి పాఠశాల రన్నింగ్ చేస్తున్నారనిఅలాగే స్కూల్ యాజమాన్యం ను అభినందిస్తూ భవిష్యత్తులో ఈ స్కూల్ ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో నిక్ ఫామ్ స్కూల్ కరస్పాండెంట్ గంధం బాబ్జిస్కూల్ బోర్డు చైర్మన్ గోళ్ళ చంటి బాబు
దేవీపట్నం మండలం ఎంపీపీ కుంజం మురళి ఇందుకూరు సర్పంచ్ కోసు లక్ష్మణ్ దొర పేరెంట్స్ కమిటీ చైర్మన్ మరి చెట్ల బుజ్జిబాబు పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడం జరిగినది