ఢిల్లీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ప్రాపర్టీ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం ఫేస్‌లెస్ ఎన్‌డీఆర్‌ఎస్‌ని అమలు చేస్తుంది. ఇది సేల్ డీడ్, లీజు రెంట్ డీడ్ మరియు ఇతర భూ పత్రాలు వంటి వివిధ రకాల ఆస్తి సంబంధిత పత్రాలకు సంబంధించిన పత్రాలను పొందడం అధికారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.
Bhu Raksha Scheme: జగనన్న భూ రక్ష పథకం.. ఈ పేరు మనకు ఆంధ్రప్రదేశ్‌లో వినిపిస్తుంది. భూరికార్డులు పటిష్టం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ప్రవేశపెట్టిన పథకంగా దీనిని అందరూ భావిస్తున్నారు. కానీ.. ఈ పథకం వాస్తవానికి కేంద్రానిది. గ్రామాల్లో భూ రికార్డుల డిజిటలైజేషన్ కోసం కేంద్రం ఈ పథకం తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం, 28కిపైగా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎన్‌జీడీఆర్‌ఎస్)ను స్వీకరించాయి. భూ రికార్డుల డిజిటలైజేషన్‌లో పురోగతి సాధిస్తోంది.
6,22,030 గ్రామాల్లో పూర్తి..
నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేగంగా జరుగుతోంది. దేశంలో మొత్తం 6,57,403 గ్రామాలు ఉండగా, ఇప్పటికే 6,22,030 గ్రామాల్లో భూ హక్కుల రికార్డుల కంప్యూటరీకరణ పూర్తయింది.
రిజిస్ట్రేషన్ ప్రయోజనాల కోసం..
ఢిల్లీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ప్రాపర్టీ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం ఫేస్‌లెస్ ఎన్‌డీఆర్‌ఎస్‌ని అమలు చేస్తుంది. ఇది సేల్ డీడ్, లీజు రెంట్ డీడ్ మరియు ఇతర భూ పత్రాలు వంటి వివిధ రకాల ఆస్తి సంబంధిత పత్రాలకు సంబంధించిన పత్రాలను పొందడం అధికారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండి వీలునామా మరియు పవర్ ఆఫ్ అటార్నీ వంటి వారి దస్తావేజు-సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవడం మరియు ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి క్యూలలో వేచి ఉండటం వంటి ఇబ్బందుల నుంచి వారిని కాపాడుతుంది.
విదేశాల్లో ఇదే తరహా..
సాధారణంగా విదేశాల్లో భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వేయర్లు, సర్వేలు ఉండవు. ఇందుకు కారణం డాక్యుమెంట్ల కంప్యూటరీకరణ. మన దేశంలో కూడా కంప్యూటరీకరణ చేయడం ద్వారా సమస్యలు ఉండవని, ఇంటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకునే అకవాశం ఉంటుందని కేంద్రం భావించింది. ఇందుకోసం జాతీయ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ స్కీం తీసుకువచ్చింది.
రాష్ట్రాల సొంత పథకంలా..
అయితే కేంద్రం తెచ్చిన పథకానికి రాష్ట్రాలు తమ స్టిక్కర్ అంటించుకుని ప్రచారం చేసుకుంటున్నాయి. భూముల రక్షణ కోసం తామే ఈ పథకం తీసుకువచ్చినట్లు చెబుతున్నాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా భూ రికార్డుల క్రమబద్ధీకరణ చేపట్టింది. ప్రస్తుతం ఏపీలో జగనన్న భూరక్ష పథకం పేరుతో రికార్డుల కంప్యూటరీకరణ చేస్తోంది. ఇలా సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది అన్నట్లుగా రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయి.