TELANGANA

: కెసిఆర్ మెచ్చిన అధికారి వెయిటింగ్ ఇక్కడ

బీహార్ రాష్ట్రానికి చెందిన సోమేష్ కుమార్ మొదటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షపాతిగా ఉన్నారు. 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సుదీర్ఘ కాలం తెలంగాణలో పనిచేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈయనను ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించారు.

Somesh Kumar: తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ భారత రాష్ట్ర సమితిలో చేరడం ఇక లాంచనమే. నిబంధనలు తుంగలో తొక్కి ఈయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడంతో హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయనకు జగన్ ప్రభుత్వం కీలక బాధ్యతలు ఏవీ అప్పగించకపోవడంతో ఆయన వెంటనే వీఆర్ ఎస్ కు దరఖాస్తు చేసుకోగా, అక్కడి ముఖ్యమంత్రి జగన్ దానికి ఒప్పుకున్నారు.. అయితే సోమేశ్ కుమార్ ఐఏఎస్ కావడంతో ఇప్పటిదాకా కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ( డీవోపీటీ) మొన్నటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయన స్వచ్ఛంద పదవి విరమణకి ఓకే చెప్పింది.

భారత రాష్ట్ర సమితి లో చేరిక

బీహార్ రాష్ట్రానికి చెందిన సోమేష్ కుమార్ మొదటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షపాతిగా ఉన్నారు. 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సుదీర్ఘ కాలం తెలంగాణలో పనిచేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈయనను ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించారు. కానీ ముఖ్యమంత్రి ఈయన మీద ప్రత్యేక అభిమానం చూపించడంతో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈయన హయాంలో పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా టీచర్ల పదోన్నతులకు సంబంధించి అప్పట్లో ఆయన వెలువరించిన జీవో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ధరణి కూడా సోమేశ్ హయాంలోనే తీసుకొచ్చిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో సోమేశ్ కుమార్ భారత రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో నిర్వహించిన సమావేశంలో ఆయనతో పాటు పాల్గొన్నారు. ఆ వేదిక పైన ముఖ్యమంత్రి కేసీఆర్ సోమేశ్ కుమార్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. హిందీ పై బాగా పట్టు ఉండడంతో సోమేశ్ కుమార్ ను భారత రాష్ట్ర సమితి ఢిల్లీ ప్రతినిధిగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

రెరా చైర్మన్ గా..

వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత తెలంగాణలో రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) చైర్మన్ గా పనిచేయాలి అని సోమేశ్ కుమార్ అనుకున్నారు. ఇదే విషయాన్ని కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ధరణి ఏర్పాటు చేసేటప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్, భూముల స్వభావం మీద తనకు పూర్తిగా అవగాహన ఉన్న నేపథ్యంలో… రెరా చైర్మన్ గా పని చేస్తానని కెసిఆర్ తో చెప్పారు. అయితే దీనికి కెసిఆర్ నో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కెసిఆర్ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో సోమేశ్ కుమార్ కు జాతీయ ప్రతినిధి గా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధిగా నియమించే అవకాశాలు కూడా లేకపోలేదని భారత రాష్ట్ర సమితి వర్గాలు అంటున్నాయి.