కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన అబ్బాయితో 2006లో వివాహం జరిగింది. లయ భర్త పేరు గణేష్ గోర్తి. ఆయన అమెరికాలో డాక్టర్.
వివాహమయ్యాక లయ అక్కడే సెటిల్ అయ్యారు. ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం.
Heroine Laya: టాలీవుడ్ లో రాణించిన తెలుగు అమ్మాయిల్లో లయ ఒకరు. 1999లో విడుదలైన స్వయంవరం మూవీతో లయ హీరోయిన్ అయ్యారు. లయది విజయవాడ. చిన్నప్పటి నుండి నటన అంటే మక్కువ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ మూవీ చేశారు. డెబ్యూ మూవీ స్వయంవరం సూపర్ హిట్ కావడంతో ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. పలు హిట్ చిత్రాల్లో నటించారు. ప్రేమించు వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసి మెప్పించారు. ఆ చిత్రంలో లయ గుడ్డి అమ్మాయి పాత్ర చేశారు.
కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన అబ్బాయితో 2006లో వివాహం జరిగింది. లయ భర్త పేరు గణేష్ గోర్తి. ఆయన అమెరికాలో డాక్టర్. వివాహమయ్యాక లయ అక్కడే సెటిల్ అయ్యారు. ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. వీరు టీనేజ్ కి వచ్చేశారు. కూతురు శ్లోక తల్లి అంత అయ్యింది. అచ్చు లయ వలె ఉంటుంది. కూతురు శ్లోకకు ఆసక్తి ఉంటే హీరోయిన్ చేస్తానంటూ ఇటీవల లయ చెప్పారు.
చాలా కాలం తర్వాత ఇండియా వచ్చిన లయ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అనేక వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. లయ ఇండియాలోనే ఉంటారని, నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారని ప్రచారం జరిగింది. అయితే లయ తిరిగి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ లయ జాబ్ లో చేరినట్లు తెలుస్తుంది. ఈ విషయం ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తెలిసొచ్చింది. తాను పనిచేస్తున్న కంపెనీ యూనిఫామ్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేశారు.
అలాగే తన కంపెనీ నేమ్ వెల్లడించారు. లయ పని చేస్తున్న సంస్థ పేరు జోబి ఏవియేషన్. ఇదో ఎయిర్ బస్ సంస్థ. లయకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. భర్త డాక్టర్ గా భారీ సంపాదన కలిగి ఉన్నారు అయినా ఏ పని చేయకుండా కూర్చోవడం లయకు ఇష్టం ఉండదు. ఎటూ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. దాంతో ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఉద్యోగం చేస్తున్నారు. ఓ అంచనా ప్రకారం లయ నెల జీతం రూ. 10 లక్షలు ఉంటుందని అంటున్నారు.