APTELANGANA

ఉద్యోగాలకు సహాయపడే లింక్డ్‌ఇన్.. తన ఉద్యోగులనే తొలగించింది..

ఉద్యోగాలను కనుగొనడానికి సహాయపడే లింక్డ్‌ఇన్ తన ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చింది. మైక్రోసాఫ్ కు చెందిన లింక్డ్‌ఇన్ గత ఫిబ్రవరిలో మొదటి రౌండ్ లో ఉద్యోగులను తొలగించింది.

తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 716 మంది ఉద్యోగులను తొలగి

ఉద్యోగాలకు సహాయపడే లింక్డ్‌ఇన్.. తన ఉద్యోగులనే తొలగించింది..

స్తున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్ ఉద్వాసనలో రిక్రూటింగ్ టీం ప్రభావితం అయింది. తాజా తొలగింపుల్లో సెల్స్, ఆపరేషన్స్ టీమ్స్ ప్రభావితం కానున్నాయి.

 

ఆర్థికమాంద్య పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ టెక్ కంపెనీలు, ఇతర కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తగ్గిన ఆదాయాల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి పెద్దపెద్ద కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.

ప్రస్తుతం లింక్డ్‌ఇన్ లో 20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గత రెండు త్రైమాసికాల్లో ఆదాయం పెరిగినప్పటికీ ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించడం గమనార్హం. లింక్డ్‌ఇన్ సీఈఓ ర్యాన్ రోస్లాన్స్కీ ఓ లేఖలో.. కంపెనీ కార్యకలాపాలనున క్రమబద్ధీకరించడం, త్వరిత నిర్ణయాలు తీసుకునేందుకు కొందరిని తగ్గించే చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు చైనాలో పనిచేస్తున్న లింక్డ్‌ఇన్ ఆధ్వర్యంలోని ఇన్ కెరీర్స్ యాప్ ను మూసేందుకు కంపెనీ సిద్ధం అయినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. డిసెంబర్ 2021లో ‘ఇన్ కెరీర్స్’ని తీసుకువచ్చింది.