తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఏఈ సివిల్ మాస్టర్ ప్రశ్నపత్రం పెద్ద ఎత్తున చేతులు మారినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇటీవల కీలక నిందితుడు రవికిషోర్ అరెస్టుతో మరికొంతమంది నిందితుల వివరాలు బయటపడుతున్నాయి.
వరంగల్ విద్యుత్ శాఖ డీఈతోపాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు సురేష్, రవికిషోర్, దివ్య, విక్రమ్ సైదాబాద్‌లో ఒకే భవన సముదాయంలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. సైదాబాద్‌లోని ఒక జిరాక్స్ కేంద్రం నుంచి ప్రశ్నపత్రాలు జిరాక్స్ తీసి విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని పలు కోచింగ్ సెంటర్ల వద్ద పేపర్ విక్రయించేందుకు నిందితులు తచ్చాడినట్లు దర్యాప్తులో తేలింది. రవికిషోర్ ఖాతాలో చాలా మందికి సంబంధించిన లావాదేవీలు బయటపడ్డాయి. ఏపీ పరీక్షలో పలువురు టాపర్లకు సంబంధించిన వివరాలు రవికిషోర్ బ్యాంక్ లావాదేవీల్లో గుర్తించారు. కాగా, టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇప్పటి వరకు మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మరో రెండు నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) మరో రెండు నియామక పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షల తేదీలను ఇటీవల ప్రకటించింది.
ఆగస్టు 8న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో అకౌంట్స్ ఆఫీసర్ నియామక పరీక్ష, సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 10 వరకు జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడంచింది. కాగా, ఇప్పటికే పలు వాయిదా పడిన పరీక్షల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్
https://websitenew.tspsc.gov.in/