TELANGANA

భోజనానికి ముందు ఒక్కటి తింటే చాలు.. ఎన్నేళ్లు వచ్చిన యవ్వనంగా ఉంటారు..

ముప్పై ఏళ్లు కూడా నిండక ముందే యూత్ ముఖంపై ముడుతలు వస్తున్నాయి..

దాంతో అందవిహీనంగా కనిపిస్తారు. ఇక అందంగా కనిపించాలని వాడని క్రీములు ఉండవు.. అలాంటి కెమికల్స్ వాడటం వల్ల ఉన్న ముడుతలు ఏమోగానీ లేనిపోని చర్మసమస్యలను కొని తెచ్చుకున్నవారం అవుతాము.. అందుకే ఈరోజు మీకోసం న్యాచురల్ గా ఈ ముడుతలను తగ్గించే టిప్ ను తీసుకొచ్చాము.. అదేంటో.. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉసిరికాయ గురించి అందరికి తెలుసు.. ఇవి రుచికి పుల్లగా, వగరుగా ఉంటాయి.. అందుకే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు.. వీటిలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. పచ్చి ఉసిరికాయలతో పాటు ఎండిన ఉసిరికాయల్లో కూడా ఈ పోషకాలు ఉంటాయి.. ఆయుర్వేదంలో విరివిగా వీటిని ఉపయోగిస్తారు.. ఎన్నో రోగాలను నయం చేస్తుంది.. ఉసిరికాయలతో జామ్ కూడా మంచిదే.. జ్ఞాపక శక్తి మెరుగుపతుంది.. రక్తాన్ని పెంచుతుంది..

ఎండిన ఉసిరికాయలను రోజూ భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల చర్మం పై ముడుతలు, చర్మ సమస్యలు తొలగిపోవడంతో పాటు జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.. నిత్య యవ్వనంగా ఉండవచ్చు. ఈ విధంగా ఉసిరికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఏ రూపంలో తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చెయ్యండి..