అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్(AP EAPCET) 2023 ఫలితాలు విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 14న ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేస్తారని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీ రంగ జనార్థన, కన్వీనర్ ప్రొఫెసర్ సీ శోభా బిందు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ ఫలితాల విడుదల కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామల రావు, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కే హేమచంద్రారెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు. మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22,23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇటీవల ఏపీ ఈఏపీసెట్ ప్రాథమిక కీ, రెస్పాన్స్ సీట్లను విడుదల చేశారు అధికారులు. మే 24 నుంచి 26 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం జేఎన్టీయూ-ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన మార్కులకు 25 శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు. ఫలితాలను