ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) మరో త్రైమాసికంలో బలమైన ఆర్థిక పనితీరును చూసినట్లయితే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ధరలు గత ఏడాది మే నుంచి పెట్రోల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం లాభాల్లో ఉన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ధరలు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి.
లీటర్ పెట్రోల్ కనీసం రూ.4 నుంచి గరిష్టంగా రూ.5 వరకు తగ్గంచేందుకు వీలుందని తెలిపారు. అయితే తగ్గింపు ఎప్పటి నుంచి అమలులోకి వస్తోందో స్పష్టతనవ్వాలేదు.. కానీ ఆగస్ట్ 1 తేదీ నుంచి ధరలు తగ్గే అవకాశం ఉందని మాత్రం పేర్కొన్నాయి. పెట్రోల్ తో పాటు డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పాయి. డీజిల్ పై నాలుగు రూపాయల నుంచి 5 రూపాయల వరకు తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి.
నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు దృష్ట్యా.. అప్పుడే ధరలు తగ్గుతాయని తెలుస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం లీటర్ పెట్రోల్, డీజిల్ పై నాలుగు నుంచి ఐదు రూపాయల వరకు తగ్గింపు ఉంటుందని అందరు భావిస్తున్నారు. అయితే ధరలు తగ్గించే సమయంలో అంతర్జాతీయంగా ధరలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి ధరలు తగ్గే అవకాశం ఉంది.
ఎప్పటి నుంచి తగ్గిస్తారో కచ్చితంగా చెప్పుకుండా కేవలం ప్రకటనలు చేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అధిక పెట్రోల్, డీజిల్ ధరలో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి.