TELANGANA

తెలంగాణలో 3డీ టెక్నాలజీ ఆలయం.. .

తెలంగాణలో సిద్ధిపేట జిల్లా బూరుగుపల్లి శివారులోని వినాయకుడి ఆలయం గురించి ఇప్పుడంతా చర్చ సాగుతోంది. మిగతా ఆలయాలకంటే ఈ ఆలయంను భిన్నంగా నిర్మించారు. అంతేకాకుండా ప్రపపంచంలో ఎక్కడా లేని విధంగా 3డి టెక్నాలిజీని ఉపయోగించడం విశేషం. సింప్లిఫోర్జ్ క్రియేషన్ తో కలిసి అప్సుజా ఇన్ ఫ్రాటెక్ ఆధ్వర్యంలో దీనిని నిర్మంచారు. దీనికి శ్రీపాద కార్య సిద్దేశ్వరస్వామి దేవస్థానం గా పేరు పెట్టారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఈ మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. దీంతో భక్తులు స్వామివార్లను దర్శించుకుంటున్నారు.

 

 

ఈ సందర్భంగా చీఫ్ ఆపరేటింగ్ అమిత్ ఘాలే ఆలయ నిర్మాణ విశేషాలు వెల్లడించారు. 35.5 అడుగుల పొడవు, 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించినట్లు తెలిపారు. 70 రోజుల పాటు శ్రమించి పూరిజగన్నాథ ఆలయ శైలిలో రూపు తీసుకొచ్చారు. భూకంపాలకు సైతం దెబ్బతినకుండా ఉండేలా టెక్నాలజీని వాడినట్లు చెప్పారు. అలాగే వేదమంత్రాల ప్రతిధ్వనులతో భక్తులు పరవశించేలా ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వసీం చౌదరి పేర్కొన్నారు.

 

 

వాస్తు శిల్పి, టెక్నాలజీ రెండింని జోడించి 3డి టెక్నాలజీ ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదు. తెలంగాణలోనే ఇది మొట్టమొదటి ఆలయం. దేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్, ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేశారు. ఇందులో మూడు గర్భాలయాలు ఉండడం విశేషం. మోదక్ ఆకారంలో ఉండే ఆలయంలో వినాయకుడు కొలువయ్యారు. దీర్ఘ చతురస్రాకార ఆలయంలో శివుడు, కమలం ఆకారంలో ఉన్న దానిలో పార్వతి దేవిని ప్రతిష్టించారు.

 

3డి ప్రింట్ ఆలయం నిర్మాణంలో పెద్ద సవాళ్లనే ఎదుర్కొన్నారు. నిర్మాణ శైలి, గోపురాలు, అన్ని 3డీ పద్ధతిలో నిర్మించారు. ప్రత్యేకమై డిజైన్ తో పాటు కచ్చితమైన అధ్యయనంతో అధిగమించినట్లు నిర్మాణదారులు తెలిపారు. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా 3డీ టెక్నాలజీతో నిర్మించిన ఈ ఆలయంలో ప్రత్యేకత నిలవనుంది. సంప్లిఫోర్జ్ అభివృద్ధి చేసిన రోబోటిక్ ఆర్మ్ సిస్టమ్ సామర్థ్యం గురించి ప్రపంచం ప్రత్యేకంగా మాట్లాడనుంది.నవంబర్ 24నుంచి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.