తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. దీంతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అభివృద్ధి, సంక్షేమంలో కొత్త అధ్యాయానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది.
ఆ తర్వాత 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. భట్టి విక్రమార్క , ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్‌బాబు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ , సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు , జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణ చేశారు.
సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గే , డీకే శివకుమార్ హాజరయ్యారు. వేదికపై వచ్చిన తర్వాత సోనియా గాంధీ రేవంత్ రెడ్డి భార్య, కుమార్తెను పలకరించారు. ఆ సమయంలో రేవంత్ మనవడిని బుగ్గనిమిరి ముద్దాడారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫైల్..
మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి స్వగ్రామం
1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి జననం
1992లో ఏబీవీపీలో పని చేసిన రేవంత్‌రెడ్డి
ఏ.వీ.కాలేజీ నుంచి డిగ్రీ
జైపాల్‌రెడ్డి సోదరుడి కూతురు గీతాతో వివాహం
2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో రేవంత్ రెడ్డి
2004లో తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి
మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి ఎంపీగా గెలుపు
2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం
2008 శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం
2009 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలుపు
2014లో కొడంగల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం
2017 అక్టోబర్‌లో టీడీపీకి రేవంత్‌రెడ్డి రాజీనామా
2017లోనే కాంగ్రెస్ పార్టీలో చేరిక
2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం
2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలుపు
2021లో టీపీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ రెడ్డి నియామకం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్, కామారెడ్డి నుంచి పోటీ
కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం