ఏపీ సీఎం జగన్ ఆ తరహా ఆరోపణలు చేసేసరికి జనసేన సైతం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 2014 తెలంగాణ ఎన్నికలను ప్రస్తావిస్తూ.. అప్పుడు వైసీపీ నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన విషయాన్ని గుర్తుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓట్లను గణాంకాలతో సహా జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
అయితే తాజాగా ఈ ఘటనపై బర్రెలక్క స్పందించారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమె ఏపీలో తన చుట్టూ జరుగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఎవరి పార్టీ వారిది.. ఎవరి రాజకీయ జీవితం వారిది అంటూ వేల్ చేశారు. పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడడం బాధగా అనిపించిందని చెప్పుకొచ్చారు. ఆయన పవర్ ఆయనది.. నా పవర్ నాది అంటూ తేల్చేశారు. తాను కూడా పవన్ అభిమానినని చెప్పుకొచ్చారు. ఆయనను తక్కువ చేసి మాట్లాడడం కోసం తనతో పోల్చడం బాధగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ గ్రేట్ పర్సన్. ఆయనను అభిమానిస్తున్నట్లు చెప్పారు. ఆయనను మైనస్ చేయడం కోసం తన ప్రస్తావన తీసుకురావడం సరికాదన్నారు. దీంతో జనసేన పార్టీ శ్రేణులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇది ట్రోల్ అవుతోంది.