Uncategorized

పాకిస్థాన్‌లోని ఇస్లామియా యూనివర్సిటీలో ఘోరం

పాకిస్థాన్‌లోని ఇస్లామియా యూనివర్సిటీలో ఘోరం జరిగింది. వర్సిటీలో సెక్స్ కుంభకోణం జరిగినట్టు బహిర్గతం అయింది. వర్సిటీలో 5వేల పోర్న్ వీడియోలు లభ్యమయ్యాయి.

పాకిస్థాన్‌లోని బహవల్‌పుర్ ఇస్లామియా యూనివర్సిటీలో దారుణమై నిజాలు బయటపడ్డాయి. ఆ వర్సిటీలో డ్రగ్స్‌, సెక్స్ కుంభకోణం చోటుచేసుకున్నట్లు తేలింది. వర్సిటీ విద్యార్థులకు చెందిన సుమారు అయిదు వేల ఫోర్న్ వీడియోలు కూడా లభ్యం అయ్యాయి. ఈ ఘటనతో దేశంలో ప్రకంపనలు మొదలయ్యాయి. డ్రగ్స్‌కు బానిసైన విద్యార్థినులకు చెందిన వీడియోలు కలవరం సృష్టిస్తున్నాయి. వర్సిటీకి చెందిన సిబ్బంది నుంచి పోలీసులు ఆ వీడియోలను సీజ్ చేశారు. బహవల్‌పుర్ వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజా ఘటనతో ఆ వర్సిటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఎపిసోడ్‌లో కేంద్ర మంత్రి చౌదరీ తారిక్ బాషిర్ చీమా కుమారుడు మాస్టర్‌మైండ్‌గా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతను డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నట్లు తేలింది. ఆ డ్రగ్స్ వల్లే వందల సంఖ్యలో ఇస్లామియా యూనివర్సిటీలో చదువుకుంటున్న మహిళా విద్యార్థులు సెక్స్ ఊబిలోకి దిగుతున్నట్లు భావిస్తున్నారు.

 

టాప్ సెక్యూర్టీ అధికారి మేజర్ ఇజాజ్ షా వద్ద అప్రోడిసియాక్ పిల్స్‌తో పాటు డ్రగ్స్ కూడా లభించాయి. ఐయూబీ విద్యార్ధులు, ఉద్యోగుల అశ్లీల వీడియో రికార్డింగ్స్ కూడా ఆయన వద్ద లభించాయి. మంత్రి చీమా తన కుమారుడిని రక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసును చేధించడం కోసం అయిదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు వర్సిటీలో దర్యాప్తు ప్రారంభించారు. తనిఖీల్లో వందల సంఖ్యలో పోర్న్ వీడియోలు దొరికాయి. యూనివర్సిటీ సెక్యూర్టీ ఆఫీసర్ ఇజాజ్‌ను పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేరున్న యూనివర్సిటీలో ఇటువంటి సెక్స్ కుంభకోణం బయట పడటంతో ఏమీ చేయాలో.. ఎలా కేసును పరిష్కరించాలో తెలియక ప్రభుత్వం తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. త్వరగా కేసును పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ వైస్‌ఛాన్స్ లర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

పోలీసులు యూనివర్సిటీ కోశాధికారిని అరెస్టు చేశారు, అతని నుండి మెత్ మరియు కామోద్దీపనలను స్వాధీనం చేసుకున్నారు. వర్సిటీ యొక్క చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ దగ్గర విద్యార్థులు మరియు సిబ్బంది యొక్క అభ్యంతరకరమైన వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విచారణలో అరెస్టయిన అధికారుల మొబైల్ ఫోన్‌లలో అనేక వాట్సాప్ చాట్‌లు, స్పష్టమైన వీడియోలతో పాటు అనేక ఆధారాలు బయటపడ్డాయి. మాదకద్రవ్యాల ఆరోపణలపై అరెస్టయిన ఇద్దరు వర్సిటీ అధికారులు విద్యార్థులను, యూనివర్శిటీ ఉద్యోగులను బ్లాక్‌మెయిల్ చేసి లైంగిక దోపిడీకి పాల్పడ్డారని పోలీసుల నివేదికలో పేర్కొన్నారు. అరెస్టు చేయబడిన వర్సిటీ కోశాధికారి “తాను ఇతర ఉపాధ్యాయుల బృందంతో కలిసి విద్యార్థుల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి పంపిణీ చేస్తానని మరియు డ్యాన్స్/సెక్స్ పార్టీలను ఏర్పాటు చేస్తానని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు అమ్మాయిలను దోపిడీ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని డ్రగ్స్‌తో వారిని ఇరికించేస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతోందని, ఆర్థికంగా వెనుకబడిన, బలహీనమైన నేపథ్యాలకు చెందిన బాలికలే లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు తెలిపారు.