World

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చ

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. త్వరలో జరగబోతున్న జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఒక్కడే 33 స్థానాల నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ ఓటమి పాలవడంతో తన పార్టీ ఎంపీల అందరిని రాజీనామా చేయించాడు. ఇప్పుడు ఆ స్థానాలకు ఉప ఎన్నికల జరగబోతున్నాయి.

ఆ స్థానాలన్నింటిలో కూడా ఇమ్రాన్ ఖాన్ పోటీ చేసేందుకు రెడీ అవ్వడంతో ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయని ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులు మరియు స్థానిక మీడియా వర్గాల వారు భావిస్తున్నారు. జాతీయ అసెంబ్లీ కి జరగబోయే ఉప ఎన్నిక ల్లో ఇమ్రాన్ ఖాన్ అన్ని స్థానాల నుండి పోటీ చేయడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుందని ఆయన పార్టీ పిటిఐ ప్రతినిధులు పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్ లో జరిగిన జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా ఇమ్రాన్ ఖాన్ 7 స్థానాల నుండి పోటీ చేసి ఆరు చోట్ల విజయాన్ని సాధించారు. ఈసారి 33 స్థానాలు నుండి పోటీ చేసి కనీసం 30 స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్నారట.