కెనడాలో ఖలిస్థాన్ మద్దతు దారులు, భారత మద్దతుదారులు పోటాపోటీగా నిరసన తెలిపారు. తాజాగా కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఒక పోస్టర్ గ్రేటర్ టొరంటో ఏరియా (జిటిఎ)లోని ఒక ఆలయం వెలుపల కనిపించింది.
ఈ పోస్టర్ ఖలిస్థాన్ అనుకూలంగా ఉంది. బ్రాంప్టన్‌లోని భారత్ మాతా మందిర్ వెలుపల “వార్ జోన్” పేరుతో ఉన్న పోస్టర్ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఉంచబడింది మరియు ఉదయం ఆలయ వాలంటీర్లు కనుగొన్నారు. ఆ తర్వాత పోస్టర్‌ను తొలగించినట్లు ఆలయ అధికారి ఒకరు హెచ్టీకి తెలిపారు.
శుక్రవారం జిటిఎలోని ఇతర ప్రదేశాలలో కూడా ఇలాంటి పోస్టర్లు కనిపించాయని అధికారులు తెలిపారు. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా పార్కింగ్ స్థలంలో హత్యకు గురైన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, నిషేధిత ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ పేరిట ప్రతిపాదిత “ఖలిస్తాన్ ఫ్రీడమ్ ర్యాలీ” నిర్వహిస్తునారు. మరోవైపు ఖలిస్థాన్ మద్దతు దారులు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారత కాన్సులేట్ వద్ద భద్రత పెంచారు.