World

అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి.. పరారీలో నిందితుడు

అమెరికాలో కాల్పుల ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాలోని జార్జియాలో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. కాల్పులకు పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నట్లు స్థానిక అధికారి ఒకరు వార్తా సంస్థకు తెలిపారు.

అట్లాంటాకు దక్షిణంగా ఉన్న ఒక చిన్న కమ్యూనిటీలో జరిగిన కాల్పుల్లో కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని జార్జియాలోని కౌంటీ ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. అట్లాంటాకు దక్షిణంగా ఉన్న హాంప్టన్ సబ్ డివిజన్‌లో శనివారం ఉదయం జరిగిన సామూహిక కాల్పులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు హెన్రీ కౌంటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

కాల్పుల ఘటన జరిగిన చోట దాదాపు 8,500 మంది జనాభా ఉన్నారు. కాల్పుల్లో నలుగురు మరణించారని, నిందితుడు పరారీలో ఉన్నాడని అధికార ప్రతినిధి మెలిస్సా రాబిన్సన్ AP వార్తా తెలిపింది. జార్జియాలోని హాంప్టన్‌లోని పోలీసులు విలేకరుల సమావేశంలో ఈ సంఘటన మాట్లాడారు. జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌తో సహా అనేక స్థానిక చట్ట అమలు సంస్థలు ప్రస్తుతం ఈ సంఘటనతో పోలీసులకు సహాయం చేస్తున్నాయి. జిబిఐ ప్రతినిధి నెల్లీ మైల్స్ తన వద్ద ఇతర సమాచారం లేదని చెప్పారు.

 

ఇంతకు ముందు కూడా అమెరికాలోని పలు నగరాల్లో కాల్పుల ఘటనలు వెలుగులోకి రావడం గమనార్హం. ఈ ఘటనలపై అధ్యక్షుడు జో బిడెన్ కూడా విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, అమెరికాలో కాల్పుల ఘటనలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో కాల్పులు జరగడం కొత్తేమి కాదు. దాదాపు ఎక్కడో ఓ చోట కాల్పులు జరుGగుతూనే ఉంటాయి. గత శుక్రవారం కూడా అమెరికాలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముందు రద్దీగా ఉండే వీధిలో కాల్పులు జరిగాయి. ఒక వ్యక్తి తుపాకీని తీసి పోలీసులపై కాల్పులు జరపడం ప్రారంభించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో నిందితుడు మరణించాడు.