World

ఇండోనేషియాలో విషాద ఘటన

ఇండోనేషియాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడు ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని వెస్ట్ సుమత్ర ఫ్రావిన్స్ లో జరిగింది. మిథేన్ గ్యాస్ లీక్ అవ్వటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పది మంది మృతదేహాలను గుర్తించినట్లు ఓ అధికారి చెప్పారు. మరో నలుగురికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

దీనిపై ఆ దేశ అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఖనిజాలు అధికంగా ఉన్న ఆగ్నేయాసియా ద్వీపసమూహంలో మైనింగ్ ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ప్రత్యేకించి సరైన భద్రతా పరికరాలను ఉపయోగించకుండా ఉండటమే ఇందుకు కారణం. ఇదే ఏడాది సెప్టెంబర్ లో బోర్నియో ద్వీపంలో జరిగిన పేలుడు ఘటనలోనూ ఏడుగురు మృతి చెందారు. ఏప్రిల్ లోనూ ఉత్తర సమత్రా ఫ్రావిన్స్ లోనూ బంగారు గనిలో పేలుడు సంభవించి 12 మంది దుర్మరణం చెందారు.