దేశంలో త్వరలో రైతుల తుపాన్ రాబోతుంది..-: సీఎం కేసిఆర్.
దేశంలో త్వరలో రైతుల తుపాన్ రాబోతోందని.. దాన్నెవరూ ఆపలేరని బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని లోహలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని 75 ఏళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎలాంటి తేడా లేదని కేసీఆర్ విమర్శించారు. రైతులు ఐక్యంగా నిలిస్తే అడ్డుకోగల శక్తి ఎవరికీ లేదని అన్నారు. శివాజీ, అంబేడ్కర్ పుట్టిన నేలలో త్వరలోనే విప్లవం వస్తుందని…