National

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పొత్తుపై తొలిసారిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పొత్తుపై తొలిసారిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. అన్ని అంశాల చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, సీట్ల కేటాయింపుపై ఇంకా చర్చ జరగలేదని, దాని గురించి తర్వాత మాట్లాడతామని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్. యడ్యూరప్ప బీజేపీ-జేడీఎస్ పొత్తుపై మాట్లాడారు. యడియూరప్పకు తాను కృతజ్ఞుడిని అని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడిన మాజీ సీఎం కుమారస్వామి బీజేపీ-జేడీఎస్ పై పొత్తు గురించి మాట్లాడారు.

కర్ణాటక రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అరికట్టాలి. 2006లో బీజేపీతో కలిసి కర్ణాటకలో తాను సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశానని మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో కేవలం మూడు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారని కుమారస్వామి అన్నారు.

చంద్రబాబుకు కరుణానిధి పరిస్థితి ఎదురు కాలేదు, సంతోషించండి, వైసీపీ కౌంటర్ !

ఏ ప్రభుత్వం వచ్చినా నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తాయని, అయితే కర్ఱాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడుతున్నారని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి ఆరోపించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మూడు నెలలకే ప్రజల నుంచి నిరసనలను ఎదుర్కొంటోంది. అలాంటి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేస్తాయని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి అన్నారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో, బీజేపీ, జేడీఎస్ పార్టీల పొత్తుల విషయంలో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని,. వీటిలో కొన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయని, త్వరలో పూర్తి సమచారం ఇస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ దళపతి హెచ్ డీ. కుమారస్వామి అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే పొత్తుల విషయంలో ఇంకా చాలా అంశాలు చర్చకు రావాల్సి ఉంది. ఇక్కడ పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం లేదు. నమ్మకం, గౌరవం ముఖ్యమని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి అంటున్నారు.