AP

బాలయ్య అన్‌స్టాపబుల్ షోపై రోజా కామెంట్స్..

విజయవాడ భవానీ ద్వీపంలో సంక్రాంతి సబంరాల ముగింపు కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు. కళకారులతో కలిసి కోలాట నృత్యం, మట్టి కుండలను మంత్రి రోజా తయారు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.. నేడు భవానీ ద్వీపానికి వస్తే తన సొంత గ్రామానికి వచ్చినట్లు ఉందని.. పర్యాటకంగా ఏపీని అభివృద్ది చేస్తున్నామన్నారు. నూతన సంవత్సర వేడుకలను కూడా మెదటి సారి భవానీ ద్వీపంలో చేశామని..

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందని మంత్రి రోజా గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్‌ వారాహితో వచ్చినా, నారా లోకేష్ యువగళంతో వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. పాదయాత్రలు చేస్తే బరువు తగ్గుతారు కానీ ప్రయోజనం ఉండదని లోకేష్‌పై సెటైర్లు వేశారు. బాలకృష్ణతో అనేక విజయవంతమైన చిత్రాలు చేశానని.. అందుకే ఆన్ స్టాపబుల్ కి వెళ్లదామనుకున్నానని రోజా తెలిపారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ ను పిలిచి ఆ కార్యక్రమ ఉద్దేశాన్నే మార్చేశారని తెలిపారు.బాలకృష్ణ పిలిచినా ఆన్ స్టాపబుల్ కి వెళ్లనంటూ రోజా తేల్చి చెప్పారు.