AP

ఏబీవీపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ, చెన్నూర్ పట్టణంలో ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మామిడి అక్షిత ఆద్వర్యంలో ర్యాలీ

4 H D ఏబీవీపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ, చెన్నూర్ పట్టణంలో ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మామిడి అక్షిత ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షిత మాట్లాడుతూ, సిద్దం వేణు అనే ఒక బిఅరెస్ zptc తమ నాయకుడిని కాలితో తన్నాడు అని, దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నాడు విద్యార్ధుల భలిదానాల ఫలితంగా వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ, అధికారం ఉందనే మధంతో విద్యార్థి నాయకుల పై దాడి సరైనది కాదు అని ఆమె అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిపులు, మిగిలి ఉన్న ఉద్యోగాల భర్తీని గురించి మంత్రి కేటీఆర్ ని ప్రస్నించిన తమ నాయకుల పై దాడి చేయడమే కాక గుండాలుగా వ్యవహరించారని ఆమె మండి పడ్డారు. వెంటనే తమ నాయకుడిని కాలితో తన్నిన సిద్దం వేణు క్షమాపణ చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి విద్యార్థులకు స్కాలర్షిపులు విడుదల చేసి, మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆమె ప్రబుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో ఏబీవీపీ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి అని అక్షిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూర్వకార్యకర్తలు సుధాకర్, పట్టణ కార్యదర్శి తిరుపతి, సాయితేజ, మంగ, శివకుమార్, శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.