మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. కేసు విచారణకు సంబంధించి.. కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. డిఐజీ చౌరాసియా నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కొత్త సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్‌పి ముఖేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు ఎస్ శ్రీమతి, పునియా, ఎస్ఐ అంకిత్ యాదవ్ సభ్యులుగా ఉండనున్నారు. ఏప్రిల్ 30లోగా విచారణను పూర్తి చేయాలని న్యాయమస్థానం ఆదేశించింది. ఇప్పటివరకు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన రామ్ సింగ్‌ను కేసు నుంచి తొలగించింది.
కుట్ర ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయాలని సీబీఐకి సూచించింది ధర్మాసనం. 6 నెలలలోపు విచారణ మొదలు కాకపోయి ఉంటే.. ఏ5 నిందితుడు సాధారణ బెయిల్‌కు అప్లై చేసుకోవచ్చని సూచించింది. అయితే, మెరిట్స్‌ను బట్టే బెయిల్‌పై నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.