AP

రైతుల ఆందోళనకి మద్దతు తెలిపిన నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర

 

  • రైతుల ఆశలపై కురిసిన వర్షపునీరు
  • తడి ఆరని కళ్ళతో ధాన్యం రైతులు
  • ఆందోళన చెందుతున్న అన్న దాతలు
  • కళ్లాల్లోనే ధాన్యం కన్నీళ్ళ మధ్య రైతులు
  • రైతుల ఆందోళనకి మద్దతు తెలిపిన నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర

    200 రూపాయలు తక్కువైనా ఇచ్చి పచ్చి ధాన్యం కనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.ఈ ఆందోళనలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర పాల్గొని మద్దతు తెలిపారు.దేశానికి రైతు వెన్నుముక అంటారు.రైతు లేకపోతే రాజ్యం లేదని, వేదికలెక్కి గొప్పలు చెబుతారు. కానీ దేశ ప్రజలందరికి ఆహార ధాన్యాలను అందించేందుకు ఆరుగాలం కష్టపడడమే కాకుండా అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటలు పండించిన రైతులు కష్టాలు పడుతుంటే ఆదుకునేందుకు ఏ ప్రభుత్వాలు ముందుకు రావడంలేదని పలువురు కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పంటలు పండించిన రైతుకు నిబంధనల పేరుతో ధాన్యం కొనుగోలు కంటి తుడుపు చర్యగా చేపట్టడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు చేతికి వచ్చే సమయానికి వాతావరణం అనుకూలించక, ఇటు ప్రభుత్వం కనికరించక ప్రతి యేటా రైతులు మోసపోతున్నారని పలువురు రైతులు వాపోతున్నారు.ప్రస్తుత సీజనులో చాలా వరకు కోతలు కోసి పనమీద ఉంచగా,చాలా మంది రైతులు కోతలకు సిద్దపడుతున్నారు.కుప్పలు నూర్చి ధాన్యం ఆరబెట్టాలంటే ఆరు కళ్లాలు లేకపోతే ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో 17 శాతం లోపు తేమ ఉండేలా ఆరబెట్టి తెస్తేనే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావం రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. వచ్చే రబీ సిజన్లో వ్యవసాయం సాగు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు.ఆర్డీవో,సొసైటీ అధికారులని, ఎమ్మార్వో,ఎంపీడీవోలని కలిసి వినతిపత్రం అందచేశారు.కార్యక్రమంలో రైతులతో పాటు ఆడారి నానాజీ,గంధం ప్రభాకర్, మూరా సహదేవుడు తదితరులు పాల్గొన్నారు.