ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఎప్పటికప్పుడు పలు జాబ్స్‌కి నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేస్తుంది.
పదోతరగతి పూర్తై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారత తపాలా శాఖ గతంలో భారీ నోటిఫికేషన్ విడుదలచేయగా..దానికి సంబంధించిన తుది జాబిత విడుదల చేసింది. 12,848 పోస్టుల భర్తీకి ఈ జాబిత రిలీజ్ అయ్యింది. దేశ వ్యాప్తంగా బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో స్పెషల్ జిడిఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 పోస్టులు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఎబిపిఎం) కింద 7,082 పోస్టులకు ఫలితాలు వచ్చాయి.
ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల తొలి జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. మణిపూర్‌కి సంబంధించిన షార్ట్ లిస్ట్‌ని విడుదల చేయలేదు. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు ఉండగా, తెలంగాణలో 96 ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు జూలై 17 లోగా డాక్యుమెంట్స్‌ని వెరిఫై చేయించుకోవాలి. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.