AP

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైసీపీ(YCP) సర్కారు ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి అనేక రకాల పన్నులు వసూలు

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైసీపీ(YCP) సర్కారు ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి అనేక రకాల పన్నులు వసూలు చేస్తోంది. దీనిపైనే విపక్షాలు జగన్(Jagan) సర్కారును తీవ్రంగా ఎండగడుతున్నాయి.
ఇక ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు చాలవంటూ కొత్తగా బీచ్‌ల దగ్గర ఎంట్రీ ఫీజులు వసూలు చేయాలనే నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao ) వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం(Visakapatnam) రుషికొండ బీచ్‌(Rushikonda Beach) దగ్గర ఎంట్రీ ఫీజు, పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రశాంతమైన సాగరతీరాన్ని ఆస్వాదించేందుకు వచ్చే వారి దగ్గర డబ్బులు వసూలు చేయడం సరికాదని ..ఈ నిర్ణయాన్ని మరొకసారి పునరాలోచించుకోవాలని ట్వీట్ చేశారు గంటా శ్రీనివాస్. జగన్ నిర్ణయంపై గంటా ఆగ్రహం..
ఏపీ ప్రజల నుంచి పన్నుల పేరుతో డబ్బులు వసూలు చేస్తోంది వైసీపీ సర్కారు. దీనికి కొనసాగింపుగా రాష్ట్రంలో సుందరమైన సాగరతీరానికి చిహ్నంగా ఉన్న విశాఖపట్నం బీచ్‌ల దగ్గర కూడా ఎంట్రీ ఫీజుతో పర్యాటకుల్ని దోచుకోవాలని చూస్తోంది. సేద తీరడానికి సాగరతీరానికి వచ్చే వారిని కూడా వదలమని అంటున్నారు వైసీపీ పాలకులు.ముఖ్యంగా బ్లూ ఫాగ్‌గా గుర్తింపు ఉన్న రుషికొండ బీచ్‌ను చూసేందుకు వచ్చే వారి దగ్గర ప్రవేశ రుసుము, పార్కింగ్ ఫీజు వేరుతో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించింది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు మండిపడుతున్నారు.

టూరిస్టుల జేబులకు చిల్లు..

పర్యాటక ప్రదేశాలను అభివృద్ది చేసి జనాన్ని ఆకట్టుకోవాల్సిన పాలకులు ఇలా ఎంట్రీ, పార్కింగ్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేయడం సరికాదంటున్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు . అంతే కాదు ట్విట్టర్‌లో ఘాటుగా దీనిపై జగన్‌ సర్కారుపై విమర్శలు చేశారు.వైజాగ్‌ని తాకట్టు పెట్టారు, విశాఖలోని అమ్మాలనుకున్న ప్రదేశాల్ని అమ్మేశారు, కూల్చాలనుకున్నవన్నీ కూల్చేసారు. చివరకు బీచ్‌లను కూడా వదలరా అంటూ మండిపడ్డారు.