AP

నిరుద్యోగులకు శుభవార్త.. సీబీఓఏలో 1000 మేనేజర్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు సిద్ధంగా వున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ IIలో భర్తీ చేస్తున్న ఈ మేనేజర్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు సీబీఓఐ తెలిపింది.

గడువు తేదీ జులై 15లోగా బ్యాంక్ వెబ్ సైట్‌లో అప్లై చేసుకోవాలి. ఆగస్టులో రెండో వారంలో లేదా మూడో వారంలో ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారని సదరు బ్యాంక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.