AP

ఏపీలో దసరా సెలవులపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం ఎట్టకేలకు తెర

పీలో దసరా సెలవులపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది.ఈసారి దసరా సెలవులపై తాజాగా పలు తేదీలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం కోసం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం కాకుండా సెలవుల్ని మార్చి ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

దీంతో విద్యార్ధులు, టీచర్లు, తల్లితండ్రుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ స్పష్టమైన ప్రకటన చేసింది.

ఏపీలో అన్ని పాఠశాలలకు అక్టోబర్ 14 నుంచి 24 వరకూ సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. దసరా సెలవుల తర్వాత 25వ తేదీన తిరిగి స్కూళ్లు తెరుచుకుంటాయని వెల్లడించింది. అలాగే ఫార్మాటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ2 పరీక్షలు ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకూ జరుగుతాయని తెలిపింది. దీంతో విద్యార్ధుల్లో నెలకొన్న గందరోగళానికి తెరపడినట్లయింది. పరీక్షలు ముగిసిన తర్వాత దసరా సెలవులు ఇవ్వబోతున్నారు.

అలాగే ఎఫ్ఏ2 పరీక్షలపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ పరీక్షలకు ఉమ్మడి ప్రశ్నాపత్రం ఉంటుందని, పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. 9, 10 తరగతుల విద్యార్ధులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం నిర్వహిస్తారు. అలాగే 6, 7,8 క్లాసులకు మాత్రం మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్ధులకు మత్రం ఉదయం ఒక పరీక్ష, మధ్యాహ్నం మరో పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 10వ తేదీలోగా సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తారు. అదే రోజు విద్యార్ధుల తల్లితండ్రులతో టీచర్ల సమావేశం నిర్వహిస్తారు.

అనంతరం 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ విద్యార్ధులకు దసరా సెలవులు ఉండబోతున్నాయి. ఈ సమయంలో చేయాల్సిన కార్యక్రమాలపైనా గతంలోలాగే ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చే అవకాశముంది.