AP

టీడీపీ ఆఫీస్ కు సీఐడీ నోటీసులు..

ఏపీ టీడీపీకి సీఐడీ మరో షాకిచ్చింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలని కోరింది. కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు సీఐడీ కానిస్టేబుల్‌ నోటీసు అందించారు. ఈనెల 18లోగా కోరిన వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది.

 

పార్టీ అకౌంట్లోకి వచ్చిన రూ. 27 కోట్ల వివరాలు చెప్పాలని అని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. ఈ నెల 18న సీఐడీ కార్యాలయానికి వివరాలతో రావాలంటూ నోటీసుల్లో సీఐడీ సూచించింది.

 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి మళ్లించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక ఆధారాలను సీఐడీ.. ఏసీబీ కోర్టుకు ఇంతకు ముందే సమర్పించింది. అంతేకాదు.. ఈ కేసులో టీడీపీ అడిటర్‌ను విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.