AP

వాలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు వరుస పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం ప్రారంభిస్తున్నారు. కూటమి నుంచి అభ్యర్దుల ఎంపిక దాదాపు పూర్తయింది. దీంతో..ఇక ప్రచారం..మేనిఫెస్టో పైన పార్టీలు ఫోకస్ చేసాయి. జగన్..చంద్రబాబు ఇద్దరూ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ప్రచారంలో ఉన్నారు. జగన్ సీఎం లక్ష్యంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

 

కొనసాగిస్తాం టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. వాలంటీర్ వ్యవస్థను తాను తొలిగించనని స్పష్టం చేసారు. వారిలో విద్యావంతులకు రూ 5 వేల కంటే ఎక్కువ వచ్చే మార్గం చూపిస్తానని చెప్పారు. తప్పుడు కేసులు పెట్టిన వారికి చక్రవడ్డీతో సహా రుణం తీర్చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు చేసారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున బనగానపల్లెకు రావడం సంతోషంగా ఉందని, జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కిందన్నారు. కృష్ణా జలాలు రాయలసీమకు అందించిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేసారు. మూడు రాజధానుల అంశం పైన స్పందించారు.

 

చిత్తుచేయాలి సీఎం జగన్ మూడు రాజధానుల గురించి చెప్పటాన్ని ప్రస్తావించారు. కర్నూలులో జుడిషియల్ క్యాపిటల్ ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని, జగన్ పాలనలో అందరూ నష్ట పోయారని విమర్శించారు. ఫ్యాన్‌ను ముక్కలు వేసి డస్ట్ బిన్‌లో పడేయాలని పిలుపిచ్చారు. కార్మికులకు పనులు దొరకడం లేదు… కార్పొరేషన్‌ల ద్వారా జగన్ ఏ ఒక్కరికీ పైసా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీని చిత్తు చిత్తు చేయాలని శంఖారావం పూరించానన్నారు. జగన్ బస్సు యాత్ర తుస్ మందని, జగన్‌ను ఇంటికి పంపడానికి జనం సిద్దంగా ఉన్నారన్నారు. బాబాయ్‌ను చంపిన దోషులకు టికెట్ ఇచ్చి వెంట తెచ్చుకుంటున్నారని విమర్శించారు.

 

గెలిపించండి అడ్డంగా సంపాదించిన డబ్బును కంటైనర్‌లో తాడేపల్లికి తరలించారని, కంటైనర్‌లలో వంటసామాగ్రి, ఫర్నిచర్ అని వైసీపీ నేతలు అనడం సిగ్గుచేటన్నారు. తనది విజన్ అని… జగన్‌ది పాయిజన్ అని అన్నారు. తంగడంచ, ఓర్వకల్లు, బనవాసిలో అనేక పరిశ్రమలకు శంకుస్థాపన చేశానని.. వాటిని జగన్ ధ్వంసం చేశారన్నారు. మాదిగలకు న్యాయం చేసే బాధ్యత తనదని, వర్గీకరణకు ఎన్డీయే కూడా ఒప్పుకుందని చంద్రబాబు చెప్పారు. మూడు సిలిండర్లు ఇచ్చి దీపం పథకాన్ని వెలిగిస్తానని, బీసీలకు 50 ఏళ్లకే ఫించను ఇస్తానని స్పష్టం చేశారు. బ్రహ్మంగారు కాలం జ్ఞానం రాసిన కొండను మింగిన అనకొండ కాటసాని రామిరెడ్డి అని చంద్రబాబు విమర్శించారు.