ఏపీ ఎన్నికల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే సీట్లు అభ్యర్థుల కసరత్తు పూర్తయింది. కానీ తాజాగా టిడిపిలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో మరోసారి అభ్యర్థుల మార్పు ఖాయంగా కనిపిస్తుంది. రఘురామరాజు టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.
సీట్ల సర్దుబాటు మూడు పార్టీల ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు ఏపీలో పూర్తయింది ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే దాని పైన నిర్ణయం తీసుకున్నారు. మూడు పార్టీల నుంచి అభ్యర్థులను సైతం ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఆ సీట్లలో మార్పు ఖాయంగా కనిపిస్తుంది. రఘురామరాజుకు బిజెపి సీటు నిరాకరించడంతో ఆయన టిడిపిలో చేరుతున్నారు. ఆయనకు నరసాపురం ఎంపీ స్థానం కోసం చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి నుంచి నరసాపురం సీటు తమకు కేటాయిస్తే, ఏలూరు స్థానం బిజెపికి ఇచ్చేందుకు సిద్ధమని ప్రతిపాదించారు. కానీ బిజెపి తమకు విశాఖ సీటు ఇవ్వాలని కోరుతుంది. అందుకు చంద్రబాబు అంగీకరిస్తే నరసాపురం ఎంపీ స్థానం టిడిపికి దక్కే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన ఆచరణ యోగ్యం కాకుంటే రఘురామరాజు ఉండి నుంచి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో మరిన్ని స్థానాల్లోనూ మార్పులు తప్పేలా లేవు.
బీజేపీ – టీడీపీ సీట్ల మార్పు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి స్థానం మీద వివాదం కొనసాగుతుంది. అనపర్తి పొత్తులో భాగంగా బిజెపికి వెళ్ళింది. ఇప్పటికే అక్కడ టిడిపి అభ్యర్థిగా ప్రకటించిన రామకృష్ణారెడ్డి చంద్రబాబు. ఆయనకు సీటు పైన హామీ దక్కింది. తాజాగా పురందేశ్వరి బీజేపీ లోకి రావాలంటే రామకృష్ణారెడ్డికి ఆహ్వానం పంపారు. అందుకు ఆయన తిరస్కరించారు. దీంతో అనపర్తిలో ఎలాంటి నిర్ణయం జరుగుతుందని ఆసక్తికరంగా మారుతుంది. కడప ఎంపీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానాల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తుంది. జమ్మలమడుగు సీటు టిడిపికి, కడప ఎంపీ స్థానం బిజెపికి దక్కేలా చర్చలు జరుగుతున్నాయి. ఇక టిడిపిలో అభ్యర్థుల మార్పు పైన చర్చ మొదలైంది దాదాపు 8 స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదని చెప్తున్నారు.
టీడీపీలో మార్పులు పాతపట్నంలో కలమట వెంకటరమణ, శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి, మడకశిరలో ఎమ్మెస్ రాజు, చింతలపూడిలో మాజీ మంత్రి జవహర్, జమ్మలమడుగు తిరిగి భూపేష్ రెడ్డికి ఇస్తారని పార్టీ నేతల సమాచారం. అయితే ఉండి స్థానం నుంచి రఘురామా పోటీ చేయాల్సి వస్తే అక్కడ ఇప్పటికే అభ్యర్థిగా ఖరారైన రామరాజు ఎలా స్పందిస్తారనేది కీలక అంశంగా కనిపిస్తుంది. ఏలూరు విశాఖ కడప ఎంపీ స్థానాల్లోనూ మార్పులు ఉంటాయని పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో ఇప్పుడు టిడిపి, బిజెపి నుంచి ఖరారైన సీట్లు అభ్యర్థుల్లో చోటుచేసుకునే మార్పుల పైన రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతుంది.