APPOLITICS

జగన్ సర్కార్ పై పవన్ మరోసారి షాకింగ్ కామెంట్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతన్న విషయం తెలిసిందే. అయితే.. ఆ వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే జగన్ సర్కార్ పై పవన్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు.

బైజూస్ ట్యాబ్ ల వ్యవహారంపై మరో ట్వీట్‌ చేశారు పవన్‌.

‘1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది.

2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని ఒప్పుకున్నారు.

3. వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం 580 కోట్ల ఖర్చుతో 5 లక్షల ట్యాబ్లెట్లు కొననుందా?

ప్రశ్నించదగిన అంశాలు

1. బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారు? కంపెనీ వారు ప్రతీ సంవత్సరం ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది.

8వ తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం బైజూస్ వారు కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదు.

2. ఒకవేళ కంపెనీ వారు ఖర్చు భరించకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? AP ప్రభుత్వమా లేక విద్యార్థులా? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో 750 కోట్లు బైజూస్ కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది (ఒక్కో విద్యార్థికి 15 వేల చొప్పున * 5 లక్షల విద్యార్థులు = 750 కోట్లు)
3. 8వ తరగతి నుండి 9వ తరగతికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారు?
4. బైజూస్ సంస్థ వారు ఏ మాధ్యమంలో, ఏ సిలబస్ అందజేస్తారు? వారు ఏ విధానం ఆధారంగా సిలబస్ రూపొందిస్తున్నారు? CBSC/స్టేట్ సిలబస్ లేదా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్నారా?

జవాబు: CBSE సిలబస్ ఆధారంగా కంటెంట్ రూపొందించాం అని సంస్థ వారు పేర్కొన్నారు’ అంటూ పవన్‌ మరోసారి ట్విట్టస్త్రాలు సంధించారు. ఇదిలా ఉంటే.. నిన్న.. బైజూస్ సంస్థ భారీగా నష్టాల్లో ఉందన్న కథనాలన ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు పవన్‌. పీఎంఓ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తన ట్వీట్ ని పవన్ ట్యాగ్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదని, టీచర్ రిక్రూట్‌మెంట్లే, టీచర్ ట్రైనింగ్ లేదని అన్నారు. నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టులు వస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను పాటించిలేదని ఆరోపించారు. ట్యాబుల పంపిణీకి ఎన్ని కంపెనీలు టెండర్లు దరఖాస్తు చేశాయి..? ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు..? ఇది పబ్లిక్ డొమైన్‌లో ఉందా? అన్న విషయాలపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు.