మీరు రెండంటే.. వాళ్లు నాలుగంటారు కవితక్కా’: బీఆర్‌ఎస్ నేతలపై కవిత విమర్శలు, ఎదురుదాడి!
బీఆర్‌ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత, పార్టీ నేతలు మరియు ఎమ్మెల్యేలపై చేస్తున్న విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి. ‘తెలంగాణ జాగృతి’ పేరిట రాష్ట్రంలో పర్యటిస్తున్న కవిత, మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు. అయితే, బీఆర్‌ఎస్ నేతలు మాత్రం కవిత విమర్శలకు దీటుగా, తీవ్ర పదజాలంతో వ్యక్తిగత ఎదురుదాడికి దిగుతున్నారు. కవిత వ్యవహారం ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతోందని గులాబీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా…

