మన ఆరోగ్యానికి మేలు చేసే దానిమ్మ జ్యూస్
మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో దానిమ్మ ఒకటి. ఎర్రగా, నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండులోని ఇల్లాజిక్ యాసిడ్ ను చర్మం మీద రాస్తే అది సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుందట. ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని ప్రదేశాల్లో దానిమ్మ సాగవుతుంది. దీనిని దామిడి వృక్షం అని కూడా అంటారు. భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దానిమ్మ సాగులో…

