చైనాలో భారత ట్రావెల్ వ్లాగర్‌కు చేదు అనుభవం: 15 గంటల పాటు నిర్బంధం!
చైనా అధికారులు భారతీయుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మరోసారి వివాదాస్పదమైంది. అరుణాచల్ ప్రదేశ్ అంశంపై గతంలో మాట్లాడినందుకు గాను, భారత ట్రావెల్ వ్లాగర్ అనంత్ మిత్తల్‌ను చైనాలోని గ్వాంగ్‌జౌ విమానాశ్రయంలో అధికారులు గంటల తరబడి నిర్బంధించారు. ‘ఆన్ రోడ్ ఇండియా’ పేరుతో ట్రావెల్ వీడియోలు చేసే అనంత్, ఈ నెల 16న తనకు ఎదురైన భయానక అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇమిగ్రేషన్ సమయంలో తనను పక్కకు తీసుకెళ్లి, దాదాపు 15 గంటల పాటు విచారణ…

