4news HD TV

National

వేగంగా రైలు ప్రమాద కేసు విచారణ ముగ్గురు రైల్వే అధికారులకు జ్యుడీషియల్ కస్టడీ

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాద కేసు విచారణ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కేసులో జూలై 7న సీబీఐ అరెస్టు చేసిన రైల్వే సిబ్బంది సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌ రిమాండ్ గడువు ముగిసింది. దీంతో వారిని శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. ఆ ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ…

World

యుద్ధం మొదలై 500 రోజులు.. అయినా ఆగని పోరాటం..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 500 రోజులు పూర్తయింది. అయినా కూడా ఈ యుద్ధం ఆగడం లేదు. ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజలను అస్థవ్యస్థం చేస్తోంది. చాలా మంది ప్రాణభయంతో విదేశాలకు వెళ్లారు. అక్కడున్న వారు బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. 60 లక్షలకు పైగా ఉక్రెయిన్ ప్రజలు శరణార్ధులుగా మారినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 9 వేలకు పైగా సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ సుధీర్ఘ యుద్ధం…

CINEMA

షారుక్, టామ్ క్రూజ్ తలదన్నే సంపద.. ఆ హీరో ఎవరంటే?

ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత సంపన్న హీరోల జాబితాలో షారుక్ ఖాన్, జానీ డెప్, డ్వెయిన్ జాన్సన్ లాంటి ఉన్న విషయం తెలిసిందే. తాజా ఫోర్డ్స్ జాబితాలో ఈ అగ్ర హీరోలను తలదన్నేలా ఎవరికి తెలియని నటుడు దూసుకొచ్చాడు. అతడే టైలర్ పెర్రీ. షారుక్, హాలీవుడ్‌ స్టార్లను మించి సంపాదించిన టైలర్ పెర్రీ ఎవరు? అతడి ఆస్తులు ఎంత? అనే వివరాల్లోకి వెళితే.. ఫోర్డ్స్ జాబితాలో అత్యంత సంపన్న నటుల జాబితాలో షారుక్ ఖాన్ (6000 కోట్లు)…

TELANGANA

గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు ‘టి-9 టికెట్‌’

టీఎస్ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన టీ9 టిక్కెట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు ‘టి-9 టికెట్‌’ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన టీ9 టిక్కెట్ ప్రయాణ సమయాన్ని పెంచింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ…

AP

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైసీపీ(YCP) సర్కారు ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి అనేక రకాల పన్నులు వసూలు

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైసీపీ(YCP) సర్కారు ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి అనేక రకాల పన్నులు వసూలు చేస్తోంది. దీనిపైనే విపక్షాలు జగన్(Jagan) సర్కారును తీవ్రంగా ఎండగడుతున్నాయి. ఇక ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు చాలవంటూ కొత్తగా బీచ్‌ల దగ్గర ఎంట్రీ ఫీజులు వసూలు చేయాలనే నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao ) వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం(Visakapatnam) రుషికొండ బీచ్‌(Rushikonda Beach) దగ్గర…

National

గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత జులైలో ఒకే రోజులో అత్యధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేశారు. ఢిల్లీలో నిన్న 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాకాలం మొత్తం వర్షపాతంలో 15% కేవలం 12 గంటల్లోనే కురిసింది. వరద నీరు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.…

World

మస్క్ మామ మైండ్ బ్లాక్.. రూల్స్ మార్చిన ట్విట్టర్.. !

ట్విట్టర్‌కు పోటీగా మెటా కొత్త యాప్‌ థ్రెడ్స్(Threads)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. థ్రెడ్స్ గురువారం ఉదయం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌, iOS ప్లేస్టోర్‌ రెండింటిలోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. థ్రెడ్స్ వచ్చిన మొదటి రోజే ట్విట్టర్ తన నిబంధనలు మార్చింది. థ్రెడ్స్ రాకతో కంగుతిన్న ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ రూల్స్ ను మార్చారు. తిరిగి పాత నిబంధనలను తీసుకొచ్చారు. ట్విట్టర్ లో కొద్ది రోజుల క్రితమే ట్విట్టర్ లాగిన్ అయిన…

CINEMA

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పవన్ కల్యాణ్

పవర్‌స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజినోవా విడిపోతున్నారని రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతోంది. అయితే ఇదే సమయంలో మెగా డాటర్ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల విడాకుల ప్రకటన రావడం కూడా .. పవన్ పై తీవ్రంగా ప్రతికూలత చూపింది. అయితే తాజాగా పవన్ .. తన భార్యతో విడిపోతున్నారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే…. మూడో భార్య.తో విడాకులు:…

TELANGANA

హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు

నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు తడిసిముద్దయ్యారు. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, బాలానగర్, సుచిత్ర, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, చిలకలగూడ, మారేడ్‌పల్లి,…

National

ఉత్తర భారతంలో తెంపు లేకుండా వర్షాలు

ఉత్తర భారతంలో తెంపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, మూడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ వాతావరణశాఖ ప్రకటించింది. మెరుపు వరదలు, కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు నీట మునిగాయి. వీటిల్లో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌ నగర్‌లో భారీవర్షానికి ఓ ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 40 సంవత్సరాల్లో…