4news HD TV

World

కెనడాలో ఖలిస్థాన్ మద్దతు దారులు, భారత మద్దతుదారులు పోటాపోటీ

కెనడాలో ఖలిస్థాన్ మద్దతు దారులు, భారత మద్దతుదారులు పోటాపోటీగా నిరసన తెలిపారు. తాజాగా కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఒక పోస్టర్ గ్రేటర్ టొరంటో ఏరియా (జిటిఎ)లోని ఒక ఆలయం వెలుపల కనిపించింది. ఈ పోస్టర్ ఖలిస్థాన్ అనుకూలంగా ఉంది. బ్రాంప్టన్‌లోని భారత్ మాతా మందిర్ వెలుపల “వార్ జోన్” పేరుతో ఉన్న పోస్టర్ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఉంచబడింది మరియు ఉదయం ఆలయ వాలంటీర్లు కనుగొన్నారు. ఆ తర్వాత పోస్టర్‌ను తొలగించినట్లు…

CINEMA

57 ఏళ్ల వయస్సులో Salman Khan పెళ్లి..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటున్నాడా.. నిజమా.. అంటే సగం నిజం.. సగం అబద్దం. పెళ్లి చేసుకోవడం నిజమే.. కానీ రియల్ గా కాదు రీల్ లో. అవును సల్మాన్.. కొత్తగా ఒక లవ్ స్టోరీని చేయనున్నాడట. పాపులర్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అంతేకాదు ఈ సినిమాకు ప్రేమ్ కు షాదీ అనే టైటిల్ ను ఖరారు చేశారట.…

TELANGANA

అంతర్గత కుమ్ములాటలతో అట్టడుగుకు బీజేపీ, పుంజుకున్న కాంగ్రెస్!

తెలంగాణ బీజేపీలో జరుగుతున్న సంఘటనలు “లాస్ట్ ది ప్లాట్” అనడానికి సరిగ్గా సరిపోయాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటల దృష్ట్యా, ఇప్పటివరకు అంతగా లెక్కల్లో లేని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బీజేపీని అధిగమించినట్లు భావిస్తున్నారు. కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీదారుగా కాంగ్రెస్ మారిందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గంలోని నేతలకు మధ్య విభేదాలు తలెత్తాయి. నేతల…

National

యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ వాసులకు గుడ్ న్యూస్

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా నోయిడా ప్రాంతంలో నివసిస్తున్న వారికి యోగీ సర్కార్ శుభవార్త చెప్పింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మూడో దశ భూసేకరణ కోసం త్వరలో సామాజిక ప్రభావ సర్వే నిర్వహించేందుకు వీలుగా యోగీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. జెవార్ లో నిర్మించబోతున్న ఈ ఎయిర్ పోర్టు కారణంగా ఈ ప్రాంతం రూపు రేఖలు మారిపోనున్నాయి. యూపీలోని గౌతమబుద్ధనగర్…

AP

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అనే దానిపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను(Amit Shah) కలిసిన తరువాత ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు లైన్ క్లియర్ అయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత ఇందుకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడటం లేదు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) సైతం తమ క్యాడర్…

World

పాఠశాలలు తెరవాలని తాలిబన్లకు విజ్ఞప్తి

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభం నాటి నుంచి నుంచి బాలికలు, మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో పాఠశాలలు మూసివేయడంతో బాలికలు ఇప్పుడు కుట్టు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేయబడిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా మంది బాలికలు అల్లికలు, కుట్టు శిక్షణ తీసుకుంటున్నారు. అదే సమయంలో వారు పాఠశాలలను తిరిగి తెరవాలని తాలిబన్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాలిబన్లు మహిళా విద్యార్థులకు మూసివేయబడిన కళాశాలలు, విశ్వవిద్యాలయాలను తిరిగి తెరవాలని కొందరు మహిళా విద్యార్థులు…

CINEMA

AI పాపనూ వదలని ఆర్జీవీ

రాంగోపాల్ వర్మ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సెన్సేషన్. అంతలా ఆయన సుదీర్ఘ కాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ వెళ్తున్నాడు. నిత్యం తనదైన సోషల్ మీడియా పోస్టులతో పాటు అప్పుడప్పుడూ సున్నితమైన అంశాలపై సినిమాలు చేస్తూ కలకలం రేపుతున్నాడు. అదే సమయంలో అందమైన భామలతో కలసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. అలాగే, సోషల్ మీడియాలో హీరోయిన్ల హాట్ హాట్ ఫొటోలను కూడా షేర్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రాంగోపాల్ వర్మ ఎవరూ…

TELANGANA

రాహుల్ గాంధీ కారులో భట్టి, పార్టీలోని పరిస్థితులపై మంతనాలు!

ఖమ్మం సభ సక్సెస్ అయిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. సభ నిర్వహణ పైన రాహుల్ గాంధీ ఖుషీ అయ్యారని నేతలు తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను భజం తట్టి అభినందించారు రాహుల్ గాంధీ. లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో ప్రస్తావించిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టోలో అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి సభ ముగిసిన…

National

మణిపూర్‌లో హింసకు పాల్పడిన వారిమీద చట్టపరంగా చర్యలు

మణిపూర్‌లో హింసకు పాల్పడిన వారిమీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని వదిలిపెట్టమని కేంద్ర ప్రభుత్వం కుకీ గ్రూపులకు హామీ ఇచ్చింది, అయితే మణిపూర్ లో సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే రాజకీయంగా పరిష్కారాన్ని సాధించగలమని కేంద్ర ప్రభుత్వం కుకీలకు స్పష్టం చేసింది. ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్, మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ సభ్యులు ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) డైరెక్టర్ తపన్ కుమార్ దేకాతో జూలై 7న రాజధానిలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయమైన నార్త్…

AP

పులివెందులలో రైతుల డబ్బుతో రోడ్ల మరమ్మతులు..

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అధికార పార్టీ పాలన వైఫల్యాలను ఎండగడుతూ ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు (Chandrababu)ఈసారి ఏకంగా వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(YS Jagan)ని టార్గెట్ చేస్తూ ఓ వార్తను తన సోషల్ మీడియా(Social media) అకౌంట్ ద్వారా ప్రజలకు షేర్ చేశారు. విచిత్రం ఏమిటంటే రాష్ట్రాన్ని పాలిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మౌళిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు.…