మహిళా వీసీని దుర్భాషలాడిన గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్
హైదరాబాద్: మహిళా వీసీని దుర్భాషలాడిన గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విజ్జులత ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 1న తనకు తాను సామాజిక కార్యకర్తనంటూ.. బాలికలకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు గడ్డం శ్రీనివాస్ యాదవ్ వీసీకి తెలిపారు. తనకు…

